: చేతులు కలిపిన రిలయన్స్, టాటా, ఎయిర్ సెల్
ప్రైవేటు టెలికాం కంపెనీలు రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, ఎయిర్ సెల్ చేతులు కలిపాయి. మూడు సంస్థలు తమ కస్టమర్లకు 3జీ రోమింగ్ సేవలను తమ నెట్ వర్క్ పరిధిలో అందించనున్నాయి. దేశంలోని 22 టెలికాం సర్కిళ్లలో ఆర్ కామ్, ఎయిర్ సెల్ 13 సర్కిళ్లలోనే 3జీ సేవలను అందిస్తుండగా, టాటా 9 సర్కిళ్లలో అందిస్తోంది. ఒప్పందంలో భాగంగా ఒక ఆపరేటర్ కస్టమర్ మరో ఆపరేటర్ పరిధిలోని సర్కిల్ కు వెళ్లినప్పుడు రోమింగ్ సేవలను పొందడానికి వీలవుతుంది.