: నేడు గజ్వేల్ బహిరంగసభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ రోజు మెదక్ జిల్లా గజ్వేల్ లో జరిగే బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలసి పాల్గొననున్నారు. గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు వరంగల్ జిల్లా మహబూబాబాద్, మరిపెడలో నిర్వహించనున్న రోడ్ షో లో కూడా పాల్గొంటారు. మరోపక్క, పవన్ గజ్వేల్ తో పాటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో కూడా పాలుపంచుకుంటారు.