: కుంభకోణాలన్నింటికీ 10 జన్ పథ్ రక్షణగా నిలిచింది: నక్వీ
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత అబ్బాస్ నక్వీ విరుచుకుపడ్డారు. ప్రధాని మన్మోహన్ చేతకాని తనం వల్లే ఇన్ని కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాలన్నింటికీ 10 జన్ పథ్ (సోనియా నివాసం) రక్షణగా నిలిచిందని విమర్శించారు. పదేళ్ల పాలనలో యూపీఏ నేతలు దోచుకోవడం తప్ప... పేదకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.