: మోడీ... నీ బతుకు బస్టాండ్ అయింది: కేసీఆర్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీని 'పిచ్చి మోడీ' అంటూ సంబోధించారు. మోడీ చెప్పినట్టు 1+1+1 కలిస్తే 111 కాదని... తెలంగాణలో పంగనామాలు అవుతాయని... మోడీ బతుకు జీరో అవుతుందని చెప్పారు. తెలంగాణలో మోడీ బతుకు బస్టాండ్ అయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై అటు వైపు ఒకర్ని (చంద్రబాబు), ఇటు వైపు మరొకర్ని (పవన్) కూర్చోబెట్టుకుని మోడీ మాట్లాడారని... దీంతో, ఆయన కాళ్లను ఆయనే నరుక్కున్నట్టయిందని చెప్పారు.