: మహిళలకు వడ్డీ లేకుండా 10లక్షల రుణం: కేసీఆర్ మరో హామీ
తాము అధికారంలోకి వస్తే మహిళలకు వడ్డీలేని రుణాన్ని 10 లక్షల రూపాయల వరకు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనమైన ప్రకటన చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో ఈ రోజు జరిగిన సభలో ఆయన పాల్గొని వరాల వర్షం కురిపించారు. వితంతవులు, వృద్ధులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. తాండూరులో బలహీన వర్గాల వారికి తొలి విడతలో 5వేల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వాలు బలహీనవర్గాల వారి కోసం అనాగరిక ఇళ్లు (నివాస యోగ్యంగాలేని) కట్టించి ఇచ్చాయన్నారు.