: కె . రాఘవకు సన్మానం! ....రాజేష్ టచ్రీవర్ కు సత్కారం!!
'తాత మనవడు' విడుదలై 41 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, వేయి పున్నములు దర్శించిన ప్రముఖ చిత్ర నిర్మాత కె.రాఘవను 'యువకళావాహిని' ఘనంగా సన్మానించనుంది. ప్రసాద్ ల్యాబ్ లో రేపు సాయంత్రం 6 గంటలకు జరుగనున్న ఈ సన్మానసభకు 'దర్శక రత్న' దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కైకాల సత్యనారాయణ, కోడి రామకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, బూరుగుపల్లి శివరామకృష్ణ, వీరశంకర్, రంగనాథ్, గీతాంజలి తదితరులు పాల్గొననున్నారు. ఇదే సభలో రాజేష్ టచ్రీవర్ తో పాటు 'నా బంగారు తల్లి' యూనిట్ ను సత్కరించనున్నామని 'యువకళావాహిని' అధ్యక్షులు వై.కె.నాగేశ్వర్ రావు తెలిపారు.