: ఈసారి గీతారెడ్డి వంతు
నియోజకవర్గానికో నేతను విమర్శించే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి గీతారెడ్డిపై విమర్శలు కురిపించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, గీతారెడ్డి సామాన్యులకు అందుబాటులో ఉండరని దుయ్యబట్టారు. గీతారెడ్డిపై సీబీఐ కేసులు ఉన్నాయని, ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించినా అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.