: రిజర్వేషన్లను ఆపేయండి: బీజేపీ నేత సీపీ ఠాకూర్
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై బీజేపీ నేత ఠాకూర్ స్పందించారు. ఉద్యోగాలతో పాటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను ఆపేయాలంటూ బీజేపీ నేత సీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి అయిన ఠాకూర్ పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఠాకూర్ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలే కాదు... బీజేపీ మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ మిత్రపక్షమైన ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ దీనిపై మాట్లాడుతూ... రిజర్వేషన్లు అనేవి సమాజంలో బలహీన వర్గాలు, దళితుల హక్కు అని, వాటిని కొనసాగించాల్సిందేనని అన్నారు.