: జగన్ ఆస్తుల అటాచ్ మెంట్ కేసు 17 కు వాయిదా


వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో రెండో విడత ఆస్తుల అటాచ్ మెంట్ పై న్యాయ ప్రాధికార సంస్థలో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) వాదనలు ముగిశాయి. ఆస్తుల అటాచ్ మెంట్ పై ఈడీ కోర్టులో రాంకీ గ్రూప్ కౌంటర్ పై అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై న్యాయ ప్రాధికార సంస్థలో ఇరువైపుల వ్యక్తులు వాదనలు వినిపించారు. అనంతర విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

అయితే పరవాడ సెజ్ లో గ్రీన్ బెల్డ్ ఏరియాను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మినిట్స్ ను అందజేయాలని ఈడీకి న్యాయప్రాధికార సంస్థ ఆదేశించింది. కాగా, 
రాంకీలో భాగస్వామి అయిన ఏపీఐఐసీ అధికారులను ఎందుకు విచారించలేదని జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో ప్రశ్నించారు. దీనిపై ఈడీ 17న వాదనలు వినిపించనుంది. 

  • Loading...

More Telugu News