: అదృశ్యమైన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె ఆచూకీ లభ్యం
నల్గొండ జిల్లా దేవరకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారిక ఆచూకీ లభ్యమైంది. ప్రస్తుతం బాలిక మీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఉంది. హారిక నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు కాసేపట్లో బాలికను తల్లిదండ్రులకు అప్పగించి వివరాలు వెల్లడించనున్నారు. రెండు రోజుల క్రితం హారిక అదృశ్యం కావడంతో బిల్యానాయక్ మీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.