: మెడికల్ పీజీ ఎంట్రన్స్ మళ్లీ నిర్వహించాల్సిందే: హైకోర్టు
మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించొద్దంటూ దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 27న జరుగనున్న ప్రవేశపరీక్షను యథావిధిగా నిర్వహించాలని కోర్టు సూచించింది. ఇంతకు మునుపు నిర్వహించిన మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయని సీబీసీఐడీ విచారణలో తేలడంతో పరీక్షను రద్దు చేసిన విషయం విదితమే.
ఈ నెల 27న జరుగనున్న ఈ ప్రవేశ పరీక్షకు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్.పీజీఎంఈటీ-2014గా పేరు పెట్టారు. మార్చి 2వ తేదీన నిర్వహించిన పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని వైస్ ఛాన్సలర్ చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఇంతకు ముందు పీజీఎంఈటీ-2014కు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.