: తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర జీరో: రాహుల్
తెలంగాణ కోసం టీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర జీరో అని అన్నారు. టీబిల్లు రూపకల్పనలో సైతం టీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆరోపించారు. తెలంగాణను బీజేపీ, టీడీపీలు అడ్డుకునే ప్రయత్నం చేశాయని అన్నారు. జూన్ 2న తెలంగాణ ప్రజల కల సాకారం కాబోతోందని చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.