: తెలంగాణ కోసం 1955లోనే పోరాడాం: పొన్నాల
విశాలాంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అంటూ 1955లోనే పోరాటం చేశామని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, సుస్థిర సుపరిపాలన అందించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. తెలంగాణ ఎవరో ఇచ్చింది కాదని, దశాబ్దాల పోరాట ఫలితమని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా సమ్మక్క, సారక్కలు పౌరుషానికి ప్రతీక అని ఆయన తెలిపారు.