: 2జీ స్కాంలో ఈడీ ఛార్జ్ షీటు.. నిందితురాలిగా కరుణ భార్య అమ్మాళ్!
సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ టెలికాం మంత్రి ఎ.రాజాపై ఈడీ ఢిల్లీ హైకోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 'మనీ లాండరింగ్ నిరోధక చట్టం' కింద రాజాతో పాటు డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్, కనిమోళి, స్వాన్ టెలికాం ప్రమోటర్ షాహిద్ బల్లా, వినోద్ గొయోంకా తదితరులు పేర్లను నిందితులుగా చేర్చి అభియోగాలు మోపింది. వారితో కలిపి మొత్తం పందొమ్మిది మంది పేర్లను ఈడీ ఈ కేసులో చేర్చింది. ఈ నెల 30న ఢిల్లీ కోర్టు ఛార్జ్ షీటుపై విచారణ చేపట్టనుంది.