: శోభానాగిరెడ్డికి నివాళులర్పించిన జగన్, విజయమ్మ
రోడ్డుప్రమాదంలో మరణించిన శోభానాగిరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలసి ఆళ్లగడ్డ చేరుకున్న జగన్... శోభానాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు.
జగన్ తోపాటు వైఎస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల కూడా శోభానాగిరెడ్డికి నివాళులర్పించారు. దివంగత నేత కుమార్తెలు, కుమారుడిని జగన్ ఓదార్చారు. మరోవైపు శోభానాగిరెడ్డిని కడసారిగా చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.