: కాంగ్రెస్ గెలుస్తుందన్న సంకేతాలు ఉన్నాయి: రఘువీరా
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడలేదని... కేవలం 5 శాతం ఓటు బ్యాంక్ మాత్రమే పోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయని అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చలేవని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 145 మంది కొత్తవారే అయినప్పటికీ... కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.