: చెన్నై-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకల పునరుద్ధరణ


గురువారం నాడు నెల్లూరు జిల్లా గూడూరు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో, నిన్న రాత్రంతా ఘటనా స్థలంలోనే ఉన్న రైల్వే అధికారులు ఇవాళ కొన్ని సర్వీసులను పునరుద్ధరించారు. మరికొన్ని రైళ్లను ఇవాళ, రేపు రద్దు చేశారు. రద్దు అయిన రైళ్ల వివరాలు...

కాకినాడ-బెంగళూరు శేషాద్రి ఎక్స్ ప్రెస్ ఇవాళ రద్దు
చెన్నై-విజయవాడ జనశతాబ్ది, పినాకినీ రైళ్లు ఇవాళ, రేపు రద్దు
ఆదిలాబాదు - నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ఇవాళ, రేపు రద్దు

  • Loading...

More Telugu News