: థర్డ్ ఫ్రంట్ కు కాంగ్రెస్ మద్దతివ్వవచ్చు: మహారాష్ట్ర సీఎం


కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు తగ్గిపోవడంతో థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వానికి మద్దతివ్వడానికి కాంగ్రెస్ మానసికంగా సిద్ధమవుతోందా? బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు మూడవ ఫ్రంట్ కు మద్దతివ్వడమే మంచిదనే ఆలోచన కాంగ్రెస్ లో మొదలైనట్లు తెలుస్తోంది. ఇందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలే నిదర్శనం. థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతివ్వడం తెరిచి ఉంచిన ఆప్షన్ అని ఆయన చెప్పారు. మోడీ సారథ్యంలో బీజేపీకి 170 సీట్లకు మించి రావన్నారు. కాంగ్రెస్ లేదా థర్డ్ ఫ్రంట్ కే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News