: నేడు వరంగల్, హైదరాబాదులలో రాహుల్ సభలు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు వరంగల్, హైదరాబాదులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హన్మకొండ సమీపంలోని మడికొండ జాతీయ రహదారి పక్కన ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అనంతరం సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. ఈ సభకు నగరంతో పాటు రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించడానికి కాంగ్రెస్ నేతలు తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వేదికగా తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.