: దానం నాగేందర్ ను ఓడించండి: విజయారెడ్డి


మాజీ మంత్రి దానం నాగేందర్ ను ఈ ఎన్నికల్లో ఓడించాలని ఖైరతాబాద్ నియోజవకర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీలో విజయారెడ్డి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తనకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసున్నారని, పీజేఆర్ కుమార్తెనైన తనను గుండెలకు హత్తుకుంటున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అందుకు ఖైరతాబాదు నియోజకవర్గంలో పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులే కారణమని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News