: టీడీపీ అభ్యర్థి కూతురు అదృశ్యం
నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బిల్యానాయక్ కూతురు హారిక (12) అదృశ్యమైంది. ఉదయం 8 గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్లిన హారిక తిరిగి రాలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రత్యర్థులే తనని భయపెట్టడం కోసం తన కూతురును కిడ్నాప్ చేసి ఉంటారని బిల్యానాయక్ ఆరోపించారు. ఈయన నల్గొండ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.