: ప్రభావవంతుల జాబితాలో మోడీపై కేజ్రీవాల్ పైచేయి
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2014కు సంబంధించి విడుదల చేసిన 'వంద మంది ప్రభావవంతులు' జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ మేరకు టైమ్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో కేజ్రీకి 71.5 శాతం 'యస్' ఓట్లు, 28.5 శాతం 'నో' ఓట్లు వచ్చాయి. ఇక మోడీకి 49.7 శాతం 'యస్' ఓట్లు, 50.3 శాతం 'నో' ఓట్లు దక్కాయి. వీరిద్దరి తర్వాత స్థానంలో ఈజిప్టు మిలటరీ కమాండర్ అబ్దుల్ ఫతాహ్ అల్ -సిసి, అమెరికన్ గాయకురాలు కాటీ పెర్రీ ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ జాబితాలో 40వ స్థానంలో నిలిచారు.