: కేజ్రీవాల్ కోటీశ్వరుడే!


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుడేమీ కాదు... కోటీశ్వరుడే! తాను సామాన్యుడినని, తన జేబులో రూ.500 మాత్రమే ఉన్నాయని చెప్పుకున్న కేజ్రీవాల్... నామినేషన్ వేసేందుకు తాను డొక్కు జీపులో వెళుతున్నానని చెప్పారు. అయితే, ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించిన నామినేషన్ లో తెలిపిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే మాత్రం... కేజ్రీవాల్ కోటీశ్వరుడని చెప్పక తప్పదు.

కేజ్రీవాల్ పేరిట స్టేట్ బ్యాంక్ ఖాతాలో రూ. 4 లక్షల నగదు ఉంది. అలాగే భార్య సునీత వద్ద రూ. 17 లక్షలకు పైగా చరాస్తి ఉందని ఆయన తెలిపారు. రూ. 90 లక్షల విలువైన స్థిరాస్తి తన పేరిట ఉండగా, సునీత పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. కోటికి పైగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఇదంతా ఆయన ఎక్కడా స్వయంగా ప్రకటించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News