: నేను ఓటేసా... మరి మీరు?: సచిన్ టెండుల్కర్


41వ పుట్టిన రోజును జరుపుకుంటున్న మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ భార్య అంజలితో కలసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని బాంద్రాలో, లీలావతి ఆస్పత్రి సమీపంలోని సుపారిటాకి పోలింగ్ బూత్ కు భార్య అంజలితో కలసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సచిన్ వచ్చారు. వారు ఒకరి తర్వాత ఒకరు ఓటేశారు. ఆ తర్వాత సచిన్ 'నేను ఓటేశా.. మరి మీరు?' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన వేలిపై ఇంక్ గుర్తున్న ఫొటోను కూడా ట్విట్టర్లో పెట్టారు.

  • Loading...

More Telugu News