: అమెరికాలో భారతీయుల జనాభా 33.4లక్షలు
అమెరికాలో ఉన్న ఆసియన్ల జనాభాలో సంఖ్యాపరంగా భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. మొత్తం 33.40 లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నట్లు సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అనే సంస్థ వెల్లడించింది. ఆసియన్ల జాబితాలో తొలి స్థానంలో చైనీయులు ఉన్నారు. అక్కడ చైనీయుల జనాభా 41 లక్షలుగా ఉంది. 35.90 లక్షల మందితో పిలిప్పీన్స్ వాసులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. భారత్ తర్వాత వియత్నాం, జపాన్ తదితర దేశాల వారున్నారు. ఎక్కువ మంది కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్, హవాయి రాష్ట్రాలలో నివసిస్తున్నట్లు సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ సంస్థ తెలిపింది.