: ఆళ్లగడ్డ ఎన్నికపై నిర్ణయం తీసుకోనున్న ఈసీ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం తర్జన భర్జన పడుతోంది. ఆళ్లగడ్డ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శోభానాగిరెడ్డి రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించారు. దీంతో ఈసీ ఆళ్లగడ్డ ఎన్నికపై కలెక్టర్ నివేదిక కోరింది. కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా ఎన్నిక నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.