: లోక్ పాల్ పై సుప్రీం విచారణ వాయిదా


లోక్ పాల్ పై ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సమయంలో లోక్ పాల్ ఛైర్మన్, సభ్యుల నియామకంపై అప్పుడే నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. దాంతో, తదుపరి విచారణను న్యాయస్థానం మే 5కు వాయిదా వేసింది. కాగా, ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వమే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News