: 'గులాబీ' గూటికి రమణాచారి!


ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన రమణాచారి ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ మాజీ ఐఏఎస్ అధికారి గతంలోనే రాజకీయాల్లోకి రావాలని పలు ప్రయత్నాలు చేశారు. అందుకు వీలుగా స్వచ్ఛంద పదవీ విరమణ కూడా చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన రాజకీయ రంగ ప్రవేశం సాధ్యం కాలేదు.

అనంతరం ఆయన్ను ప్రభుత్వం సాంస్కృతిక సలహాదారుగా నియమించింది. మరికొద్ది రోజుల్లో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రమణాచారి తన రాజకీయ ప్రవేశంపై పునరాలోచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు టీఆర్ఎస్ ముఖ్య నేతలు తమ పార్టీలో చేరమని రమణాచారిని సంప్రదించగా, ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News