: 41వ పుట్టిన రోజు సంబరంలో సచిన్


క్రికెట్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుని, భారతరత్నంతో మెరిసిన సచిన్ టెండూల్కర్ నేడు 41వ పుట్టిన రోజు సంబరంలో ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్ లను చూసేందుకు యూఏఈ వెళ్లిన సచిన్ రెండు రోజుల క్రితమే ముంబై తిరిగొచ్చారు. ఈ రోజు ముంబైలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకను జరుపుకోనున్నట్లు సచిన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతేడాది నవంబర్ లో క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగిన తర్వాత సచిన్ కు ఇదే తొలి పుట్టిన రోజు. 1973 ఏప్రిల్ 24న సచిన్ ముంబైలో జన్మించారు.

  • Loading...

More Telugu News