: ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు: ఉత్తమ్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని... అందుకే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. కేసీఆర్ కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు. తన నియోజకవర్గమైన హుజూర్ నగర్ ను ఎవరూ దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు.