: నేడు ఖమ్మం జిల్లాలో ప్రచారం నిర్వహించనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపటి క్రితం ఆయన నిర్మల్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు. 11 గంటలకు కొత్తగూడెం చేరుకుని అక్కడ ప్రసంగిస్తారు. అనంతరం 12.35 గంటలకు భద్రాచలం, సాయంత్రం 3.35 గంటలకు మధిర, 5.35 గంటలకు ఖమ్మంలో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు పెద్దతాండ, 8 గంటలకు తాళ్లపాడు, 8.30 గంటలకు కూసుమంచిలో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు పాలేరులో ప్రసంగిస్తారు.