: కొనసాగుతోన్న ఆరో దశ పోలింగ్... చెన్నయ్ లో ఓటేసిన రజనీకాంత్


సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 117 లోక్ సభ స్థానాలలో ఆరో దశ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 2076 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. తమిళనాడులో 39, మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్ లో 12, మధ్యప్రదేశ్ లో 10, బీహార్లో 7, చత్తీస్ గఢ్ లో 7, పశ్చిమబెంగాల్ లో 6, అస్సాంలో 6, రాజస్థాన్ లో 5, జార్ఖండ్ లో 4, జమ్మూకాశ్మీర్లో 1, పుదుచ్చేరిలో 1 స్థానాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. దీంతో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా అనిల్ అంబాని, ములాయం సింగ్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News