: అధికారం ఇస్తే సేవ చేస్తా... ఇవ్వకుంటే విశ్రాంతి తీసుకుంటా: కేసీఆర్
సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్నారు. లేకుంటే హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. సన్నాసులకు అధికారం ఇస్తే తెలంగాణను సర్వనాశనం చేస్తారని విమర్శించారు. ఒక్క టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమన్న కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు.