: ఎస్సెమ్మెస్ సేవలపై హెచ్.డి.ఎఫ్.సి రుసుం


దేశంలోని ప్రైవేటు రంగంలో రెండో అతిపెద్ద బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ తన వినియోగదారులపై చిరు భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ఖాతాల నిర్వహణ సమాచారం గురించి ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న ఎస్సెమ్మెస్ సేవలు ఇక నుంచి రుసుం ఆధారిత సేవలుగా మార్చాలని నిర్ణయించింది. హెచ్ డీఎఫ్ సీ తన వినియోగదారులకు.. అకౌంట్ల లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కొనుగోళ్ళు, బ్యాలన్స్ వివరాలను ఎస్సెమ్మెస్ ల ద్వారా ఎప్పటికప్పుడు పంపుతూ ఉంటుంది.

ఇప్పటి వరకు ఈ సేవలు ఉచితంగానే అందించారు. కాగా, నేటి నుంచి ఎస్సెమ్మెస్ సేవలకు రుసుం చెల్లించాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇకముందూ ఈ ప్రత్యేక ఎస్సెమ్మెస్ సదుపాయం అందుకోవాలంటే, 'శాలరీ అక్కౌంట్' ఖాతాదారులు త్రైమాసికానికి రూ. 15..  'కరెంట్ అకౌంట్' ఖాతాదారులు త్రైమాసికానికి రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది. 

  • Loading...

More Telugu News