: ఓట్లు చీల్చకూడదనే నేను పోటీ చేయడం లేదు: పవన్ కల్యాణ్
ఓట్లు చీల్చకూడదనే భావనతోనే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే మూడు పార్టీలు కలిసి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ పార్టీలు విజయం సాధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అందుకే జనసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.