: జేబులో 500 ఉన్నాయ్.. పాత జీపులో వెళుతున్నా: కేజ్రీవాల్


భారీ జనసందోహం మధ్య కేజ్రీవాల్ వారణాసిలో నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరారు. నెత్తిన గాంధీ టోపీ ధరించిన ఆయన ఓ పాత జీపులో రోడ్ షో నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. 'నా జేబులో 500 రూపాయలే ఉన్నాయి. ఎన్నికల్లో పోరాడడానికి నా దగ్గర డబ్బుల్లేవ్. నామినేషన్ వేయడానికి ఈ పాత జీపులో వెళుతున్నాను. మోడీ రేపు నామినేషన్ వేయడానికి హెలికాప్టర్లో వస్తారు. జాగ్రత్త... మీరు మోడీని హెలికాప్టర్లో మాత్రమే చూడగలరు' అంటూ వారణాసి ప్రజలను హెచ్చరించారు. ప్రత్యర్థులు ప్రచారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ విమర్శించారు.

  • Loading...

More Telugu News