: సీమాంధ్రలో సోనియా, రాహుల్ పర్యటన ఖరారు: రఘువీరా
సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ పర్యటన తేదీలు ఖరారయ్యాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 5 వరకు వీరి పర్యటనలు ఉంటాయని చెప్పారు. గుంటూరు, విశాఖ, అనంతపురం జిల్లాల్లో నిర్వహించే సభల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములకు తానే బాధ్యత వహిస్తానని అన్నారు.