: 'టీవీ'క్షకులకు 'టాప్' లేస్తోంది
నిర్ణీత గడువులోగా సెట్ టాప్ బాక్సులు అమర్చుకోని ఫలితంగా హైదరాబాద్, విశాఖపట్నంలోని లక్షల టీవీలు మూగనోము పట్టాయి. దేశ వ్యాప్తంగా 38 నగరాల్లో కేబుల్ టీవీ రంగం డిజిటలైజేషన్ ప్రక్రియను మార్చి 31 అర్థరాత్రిలోగా పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే, భారీ సంఖ్యలో సెట్ టాప్ బాక్సులు అవసరమైన నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు చేతులెత్తేసినట్టు సమాచారం. దీంతో, సెట్ టాప్ బాక్సులు సమకూర్చుకోలేని వినియోగదారులకు ప్రభుత్వ నిర్ణయం శాపమైంది.
ఈరోజు ఉదయం నుంచి ఈ రెండు నగరాల్లో అనలాగ్ ప్రసారాలు నిలిచిపోయాయి. కాగా, కొన్ని నెట్ వర్క్ లు మునుపటిలా తమ ప్రసారాలను అనలాగ్ విధానంలో కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, ముఖ్యమంత్రి.. సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంచాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖకు లేఖ రాసినా, సదరు మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు స్పందించలేదు.