: బాధతో ఉన్న ప్రియాంకకు జైట్లీ సూచన
తన భర్తపై రాజకీయ విమర్శలు తనను బాధిస్తున్నాయంటూ గోడును వెళ్లబోసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా కుమార్తె ప్రియాంకకు బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఓ సూచన చేశారు. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా సోదరుడు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలకు సూచించాలని ప్రియాంకకు హితవు పలికారు. మోడీ చిన్నతనంలో జరిగిన పెళ్లిపై రాహుల్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ నిజంగా అర్థం చేసుకుంటే మోడీపై పెళ్లి విషయంలో వ్యక్తిగత విమర్శలు చేసేవారు కాదని జైట్లీ అన్నారు. వ్యక్తిగత విమర్శలు బాధిస్తాయన్న ప్రియాంక అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. వీటికి దూరంగా ఉండాలన్నారు. ప్రియాంక సూచన మంచిదని, అయితే, ఇది ముందుగా ఆమె ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు.