: తెలంగాణను అభివృద్ధి చేయగలిగేదెవరో ఆలోచించండి: కరీంనగర్ సభలో మోడీ
కరీంనగర్ లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలను ఆలోచింపజేసేలా ప్రసంగించారు ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ. తెలంగాణను అభివృద్ధి చేయగలిగేదెవరో, అదృష్టాన్ని మార్చగలిగేదెవరో ఆలోచించాలని కోరారు. తెలంగాణ కోసం 1100 మంది బలిదానాలు చేశారు, వీటికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణను పసిబిడ్డలా చూసుకునే ప్రభుత్వం ఢిల్లీలో రావాలని, అలాంటి బాధ్యతాయుత పార్టీ అయిన బీజేపీకి ఎన్నికల్లో మద్దతివ్వండని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు పరీక్షలాంటివని, మోసం చేసిన వాళ్ల చేతుల్లోనే మళ్లీ తెలంగాణను పెడతారా? అని అడిగారు. తెలంగాణ ఇవ్వకుండా ఇన్నాళ్లు సాగదీసిన పాపం కాంగ్రెస్ దేనని ఆరోపించారు.