: పవన్ ను ఆకాశానికెత్తేసిన మోడీ
నిజామాబాద్ బహిరంగసభలో ప్రసంగించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆకాశానికెత్తేశారు. "తెలంగాణ ఏర్పడటం, సీమాంధ్రలో ఆందోళన నేపథ్యంలో నేను చింతిస్తున్న సమయంలో... ఒక రోజు నా దగ్గరకు పవన్ వచ్చారు. రాజకీయాలను పక్కనపెట్టి, నా మనసులోని మాటను చెబుతున్నా... పవన్ మాటలు నా మనసును కదిలించాయి. పవన్ కల్యాణ్ లాంటి యువకులు ఉన్నంత కాలం... తెలుగు స్పూర్తి కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలు ముందుకు సాగుతాయి. తెలుగు సంస్కృతిని కాపాడే సత్తా పవన్ లో ఉంది. " అంటూ పవన్ ను మోడీ పొగడ్తలతో ముంచెత్తారు.