: బొత్సను విజయనగరం నుంచి తరిమికొట్టాలి: బాలయ్య
మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణపై ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. మద్యం సిండికేట్లు సహా అన్నింటిలో బొత్స దొంగ అని వ్యాఖ్యానించారు. వెంటనే విజయనగరం నుంచి బొత్సను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుపై ఆరోపణలు చేసేవారే 420లో నిపుణులన్నారు. ఇచ్చిన హామీలపై టీడీపీ స్పష్టతతో ఉందని బాలయ్య నొక్కి చెప్పారు.