: ఈ గ్రామం కవలలకు పెట్టింది పేరు
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ సమీపంలో ఉన్న ఉమ్రి గ్రామానికి వెళితే ఒకేలా ఉండే ఇద్దరిద్దరు దర్శనమిస్తుంటారు. కొత్తవారైతే తెల్లబోయి చూడాల్సిందే. ఎందుకంటే ఈ గ్రామం కవల పిల్లలకు పెట్టింది పేరు. ఈ గ్రామంలో మొత్తం మీద 108 మంది కవలలు కనిపిస్తారు. వారిలో 6 నుంచి 80 సంవత్సరాల వయసు వారున్నారు. అయితే, ఇలా ఎందుకు జరుగుతుందన్నది తెలుసుకోలేకపోయారు. రక్త నమూనాలను తీసుకుని పరీక్షించినా అసలు కిటుకు ఏంటో తెలియలేదు. అయితే, ఇప్పడు ఎన్నికల వేళ ఓటేయడానికి వస్తున్న కవలల్లో అసలు ఎవరో తెలుసుకోలేక ఎన్నికల సిబ్బంది అయోమయానికి గురవుతున్నారట.