: మోడీ ప్రభావం ఏమీ లేదు: రేణుకా చౌదరి


కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొంతమంది భావిస్తున్నట్టు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం మన దేశంలో ఏమాత్రం లేదని... కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. ఈ రోజు ఆమె ఖమ్మం జిల్లా పాల్వంచలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో ఆమె వెంట సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాం యాదవ్ ఉన్నారు.

  • Loading...

More Telugu News