: నేడు ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్... భారీ భద్రత


ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ, బీజేపీలు ఈ రోజు తెలంగాణలో భారీ ప్రచారానికి తెరతీశాయి. ఈ క్రమంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. మొత్తం నాలుగు సభల్లో ఆయన పాల్గొంటారు. ఈ ప్రచార పర్వంలో మోడీతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వేదిక పంచుకోనున్నారు.

హైదరాబాద్, మహబూబ్ నగర్ సభల్లో మోడీతో పాటు చంద్రబాబు కూడా పాల్గొంటారు. అలాగే, హైదరాబాద్, నిజామాబాద్ సభలకు పవన్ కల్యాణ్ హాజరవుతారు. హైదరాబాద్ లో జరిగే భారీ సభలో ఈ ముగ్గురూ వేదికను పంచుకోనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు నిజామాబాద్, సాయంత్రం 3.15కు కరీంనగర్, 5 గంటలకు మహబూబ్‌నగర్, 6.15 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నరేంద్ర మోడీ సభలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వందలాది మంది పోలీసులు సభాప్రాంగణాన్ని పహరా కాస్తున్నారు.

  • Loading...

More Telugu News