: గ్రామాలకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తాం: చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సీమాంధ్ర ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు గంగాధరనెల్లూరులో బాబు మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాలకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. అంతేగాక డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, మహిళలకు, ఆడపిల్లలకు భద్రత కల్పిస్తామని, మద్యం గొలుసు దుకాణాలు రద్దు చేస్తామని చెప్పారు. ఇక వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛను తప్పకుండా ఇస్తామని తెలిపారు. ఏపీలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. భవిష్యత్తు ఆలోచించే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, వాజ్ పేయి హాయంలో ఎన్నో పనులు చేయించుకున్నామని గుర్తు చేశారు.