: సీమాంధ్రలోనూ సోనియా, రాహుల్ ల పర్యటన: జైరాం రమేశ్
ఇప్పటికే తెలంగాణలో నిర్వహిస్తున్న సభల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు త్వరలో సీమాంధ్రకు వస్తారని కేంద్రమంత్రి జైరాం రమేశ్ తెలిపారు. ఈ మేరకు ఓ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, వచ్చేవారం గుంటూరు, అనంతపురంలో సోనియా పర్యటిస్తారని తెలిపారు. ఆ తర్వాత రాహుల్ పర్యటన ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర అంటూ కిరణ్ ఇంకా కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర శూన్యమని, బిల్లు రూపకల్పనలో కేసీఆర్, కేటీఆర్ కు భాగస్వామ్యం లేదన్నారు జైరాం. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.