: అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోసం భారత విద్యార్థుల పోటీ
అమెరికాలో ఈ ఏడాదికి గాను గ్రాడ్యుయేషన్ స్కూళ్లలో ప్రవేశాల కోసం భారతీయ విద్యార్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే 32 శాతం అదనంగా భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సీజీఎస్ ఇంటర్నేషనల్ సర్వే తెలిపింది. అదే సమయంలో చైనా విద్యార్థుల దరఖాస్తుల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. మొత్తం మీద విదేశీ విద్యార్థుల దరఖాస్తులలో పెరుగుదల 7 శాతమే ఉండగా, భారతీయ విద్యార్థుల స్పందన మాత్రం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.