: వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ లకు కాలం చెల్లింది: బాలకృష్ణ
రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ హిందూపురం అభ్యర్థి బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ లకు కాలం చెల్లిందన్నారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలంటే ఓటర్లు కాదని.. ప్రజలంటే ప్రభంజనమని పేర్కొన్నారు. టీడీపీ ఎప్పటికీ రైతుల పార్టీయేనన్న బాలయ్య యువతకు ఉద్యోగం రావాలంటే టీడీపీ అధికారంలోకి రావల్సిందేనని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటామని, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం కల్తీ అయిందని ఆరోపించారు.
అంతకుముందు శ్రీకాకుళం చేరుకున్న బాలయ్య దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కె.ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నరసన్నపేట, పొలాకి, కొల్లివలస, సింగ్ పురం మండలాల్లో నేడు ఆయన పర్యటన ఉంటుంది.