: కేసీఆర్... నీ భాష మార్చుకో: కటారి శ్రీనివాసరావు


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని, ఆయన భాషను మార్చుకోవాలని లోక్ సత్తా ఎమ్మెల్యే అభ్యర్థి కటారి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ ప్రకటన అనంతరం హైదరాబాదులో నివసించే మనమంతా ఒకటేనని చెప్పిన కేసీఆర్, ప్రస్తుతం విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఓటమి భయమే కారణమని కటారి విమర్శించారు. అందరికీ ఉద్యోగాలిస్తామంటూ మోసం చేసి కేసీఆర్ ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక పార్టీ లోక్ సత్తా అని కటారి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News